హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: దళిత బాలుడిని చితకబాదిన యువకులు..వీడియో వైరల్

క్రైమ్17:46 PM June 05, 2019

రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో దారుణం జరిగింది. గుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ దళిత బాలుడిని కొందరు యువకులు చితకబాదారు. కాళ్లు చేతులు కట్టేసి కర్రలతో దాడిచేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుడిలోకి దళితులకు ప్రవేశం లేదంటూ అగ్రకులాలకు చెందిన వ్యక్తులు దాడిచేశారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఐతే ఓ అమ్మాయిని వేధించడం వల్లే అతడిని కొట్టారని అగ్రవర్ణాలు చెబుతున్నాయి. ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

webtech_news18