హీరో శివాజీని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో లుక్ ఔట్ నోటీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్‌పోర్టును సైబర్ క్రైం పోలీసులు బుధవారం సీజ్ చేశారు. శివాజీకి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 11న పూర్తి వివరాలతో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.