హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: చిత్తూర్‌లో భారీ రోడ్డు ప్రమాదం... కారు కింద చిక్కుకున్నా సేఫ్‌గా...

ఆంధ్రప్రదేశ్18:53 PM April 03, 2019

భూమ్మీద నూకలు ఉండాలే గానీ సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా భేషుగ్గా బ్రతికేయొచ్చు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. బైక్‌పై వెళ్తున్న ఓ బైక్‌ను వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువతీ, యువకుడు ఇద్దరు ఎగిరి కారు కింద పడిపోయారు. ముఖ్యంగా యువతి కారు ముందు చక్రాల మధ్య ఇరుక్కుపోయింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారును ఆపిన అందులోని వ్యక్తులు.. వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కారు అంత వేగంగా ఢీకొట్టినా... ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడడం విశేషం.

Chinthakindhi.Ramu