కూకట్ పల్లి ప్రగతినగర్‌కు చెందిన పవన్, సౌమ్య దంపతులు పాల బూత్‌కు వెళ్లి పాలు తెచ్చుకున్నారు. పాలు కాస్తున్న సమయంలో అవి విరిగిపోయాయి. పగిలిపోయిన పాలు కాస్త కొత్తగా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది.అందులో ప్లాస్టిక్ లాంటి పదార్థం కలిసిందని అనిపించింది. ఇదేంటని పాల బూత్ యజమానిని నిలదీస్తే... నీ దిక్కున్న చోట చెప్పుకోవాలని వారిని బెదిరించారు. దీంతో బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.