హోమ్ » వీడియోలు » క్రైమ్

TTD: గుట్కా లొల్లి.. తిరుమలలో భక్తులకు, సెక్యూరిటీకి మధ్య ఘర్షణ

TTD: అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భక్తులకు, సెక్యూరిటీకి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన 45మంది భక్త బృందం తిరుమల శ్రీవారిని దర్సించుకోవడానికి తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద లగేజ్ చెక్ చేస్తుండగా నారాయణస్వామి అనే భక్తుడు గుట్కా ప్యాకెట్ ను చేతిలో పట్టుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది గుట్కా తీసుకెళ్ళకూడదని చెప్పి కిందపడేయమన్నారు. నారాయణస్వామి గుట్కా ప్యాకెట్ ను కిందపడేసి లగేజ్‌ను చెక్ చేయించుకుని వెనక్కి వచ్చి మళ్ళీ గుట్కా ప్యాకెట్‌ను తీసుకున్నాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది నారాయణస్వామి చేతిలో ఉన్న గుట్కా ప్యాకెట్‌ను లాక్కొనబోతే, గుట్కా ప్యాకెట్ ఇవ్వకుండా సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది నారాయణ స్వామిపై దాడి చేశారు. దీంతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది.

Shravan Kumar Bommakanti