హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో పేలుడు సంభవించింది. ఓ చెత్తకుప్ప వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడు ఉన్న నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.చెత్త కుప్ప వద్ద కెమికల్ బ్లాస్ట్ జరిగినట్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఇవాళ తెల్లవారుజామునే ముషీరాబాద్‌లోనే మరో ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముషీరాబాద్‌లోని మారుతీ కార్ల షోరూం. ఉన్నట్టుండి అక్కడ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. మంటలు రావడంతో... చుట్టుపక్కల వాళ్లు హడలిపోయారు. ఏం జరిగిందో అంటూ అంతా మారుతీ కార్ల షోరూం వైపు చూశారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతూ కనిపించాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే అప్పటికే మంటల్లో కాలి ఏడు కార్లు కాలి బూడిదయ్యాయి. సంఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ లు పరిశీలించారు.