అసలే పానీ పూరీ తినాలంటే మనం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే... వాటి పిండిని కాళ్లతో తొక్కి తయారుచేస్తారనే ప్రచారం ఉంది కాబట్టి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పానీ పూరీకి వాడే నిమ్మ, ఉప్పు నీటి కోసం... రోడ్డు పక్కన మురికి నీటిని పట్టుకుపోయాడు ఓ పానీ పూరీ వాలా. మహారాష్ట్రలోని నాగపూర్లో కనిపించిందీ షాకింగ్ సీన్. ఇలా చాలా మంది వ్యాపారులు చేస్తున్నారు. ప్రజలేమో... బయట కనిపించే స్నాక్స్, చిరుతిళ్లను ఇష్టపడి తింటున్నారు. కానీ... చాలా మంది తమను ఎంతలా మోసం చేస్తున్నారో తెలుసుకోవట్లేదు. ఈ వీడియో చూశాక... పానీ పూరీ తినాలో వద్దో మీరే ఆలోచించుకోండి.