గుజరాత్... అహ్మదాబాద్‌లోని ఇషాంత్పూర్లో జరిగిందీ ఘటన. అప్పటిదాకా జాగ్రత్తగానే కారు నడిపిన డ్రైవర్... ఓ సిగ్నల్ దగ్గర యూ టర్న్ తీసుకుంటూ... ఓ బైకర్‌ను ఢీకొట్టాడు. కనీసం సారీ కూడా చెప్పకుండా... వేగంగా కారు నడుపుతూ పారిపోయాడు. గాయపడిన ఆ బైకర్‌ను స్థానికులు కాపాడారు. అక్కడి సీసీ టీవీలో కారు నంబర్ సరిగా కనిపించట్లేదు కాబట్టి... అదే రూట్లో వేరే సీసీ కెమెరాల్లో ఆ కారు వివరాలు దొరుకుతాయేమోనని పోలీసులు చూస్తున్నారు.