హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం... పెట్రోల్ బంకులో మంటలు

క్రైమ్15:26 PM December 31, 2019

హైదరాబాద్‌లో ఓ పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని షేక్ పేటలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంకుకు వచ్చిన కారులో పెట్రోల్ ఫిల్ చేస్తుండగా హఠాత్తుగా కారులో మంటలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్లందరూ పరుగులు పెట్టారు. కారులో ఉన్నవాళ్లు బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. అయితే మంటల్లో కారు, పెట్రోల్ బంక్ పూర్తిగా కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా షేక్ పేట్, రాయదుర్గం మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. మంటల కారణంగా భారీ ఎత్తున పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మంటలు ఎలా వ్యాపించాయనే విషయాన్ని పెట్రోల్ బంకు సిబ్బంది చెప్పలేకపోతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దీనిపై విచారణ మొదలుపెట్టారు.

webtech_news18