కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ యుకువడిని చంపేశారు. పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలైన అతడు చనిపోయాడు. అథాని ప్రాంతంలోని ఓ లిక్కర్ షాపు ముందు ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. హత్య దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మృతుడిని తురుతిసరీ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల బినోయ్గా పోలీసులు గుర్తించారు.