గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిందీ ఘటన. వర్షం పడుతుండటంతో... ఓ చిన్నారి... తన ఇంటి ఆవరణలో గొడుగుతో నడుస్తూ... ఓ చోట ఆగాడు. ఇంతలో ఓ కారు... రివర్స్ డ్రైవ్ చేసుకుంటూ... అటే వచ్చింది. డ్రైవర్ ఆ చిన్నారిని చూడకపోవడంతో... చిన్నారి పై నుంచీ కారు వెళ్లిపోయింది. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న ఆ పెద్దాయన... కారు డ్రైవర్ని అలర్ట్ చేసి... కారును ఆపించాడు. వెంటనే స్థానికులు పరుగున వచ్చి... కారు కింద ఉన్న చిన్నారిని కాపాడారు. లక్కీగా ఆ పిల్లాడికి ఏమీ కాలేదు. అందరూ అదృష్టవంతుడు అని అన్నారు. కారు డ్రైవర్‌కి చివాట్లు పెట్టారు.