హైదరాబాద్ శివారు మీర్పేట్లో ఓ బాక్స్ పేలింది. ఈ ఘటనలో చెత్త ఏరుకునే ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. నిర్మల అనే చెత్త ఏరుకునే మహిళకు.. మీర్ పేట్‌లోని విజయపురి కాలనీలో చెత్తకుప్ప దగ్గర ఓ బాక్స్ కనిపించింది. అయితే, అందులో ఏముందో చూసేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ, బాక్స్ మూత తెరుచుకోకపోవడంతో ఆ బాక్స్‌ను గట్టిగా నేలకు వేసి కొట్టింది. దీంతో బాక్స్ పేలిపోయింది.