బెంగళూరులో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. ఓ మైనర్ బాలుడిని చెరువులో ముంచి చిత్రహింసలు పెట్టారు. అన్నా.. వద్దని వేడుకున్నా వినలేదు. అతడు ఏడుస్తుంటే వారంతా పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో ఐదుగురు మైనర్లు ఉన్నారు.