అమెరికాలో జాబ్ ఇప్పిస్తానంటూ.. కూకట్ పల్లికి చెందిన రాజన్ అనే వ్యక్తి దగ్గర వివిధ దశల్లో 47 లక్షలు వసూలు చేశారు నైజీరియన్ గ్యాంగ్. వివరాల్లోకి వెళితే అమెరికాలోని లాస్ ఎంజల్స్‌లో ఓ హోటల్లో మెనేజర్‌గా జాబ్ ఇప్పిస్తానని.. వివిధ దశల్లో దాదాపు రూ 47 లక్షలకు మోసం చేశారు నైజీరియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు. కాగా బాధితుని ఫిర్యాదు మేరకు కేసు విచారించి అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.