నిజామాబాద్ జిల్లాలో లాక్ డౌన్ దృష్ట్యా వైన్ షాపులు పూర్తిగా మూసివేయడంతో బ్లాక్ లో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. మద్యం బాటిళ్ల పై ఉండే ఎమ్ఆర్ పి ధరల కంటే నాలుగు రేట్లు ఎక్కువ చేసి మద్యం అమ్ముతున్నారు.. ఇదే అనుగుగా బావించి కొందరు కల్తీ మద్యాన్ని తయారు చేసి డబ్బులు దండుకుంటున్నారు. పక్క సమాచారంతో కల్తీ మద్యం తయారు దారులను ఎక్పైజ్ అధికారులు పట్టు కున్నారు. ఆర్మూర్ మండలంలోని సుద్దులం గ్రామంలో కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నరన్న సమాచారంతో ఆర్మూర్ ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించి కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. అమ్మకాలు జరిపిన నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. కల్తీ మద్యన్ని సేవించి ఇబ్బందులు పడవద్దని ఆయన తెలిపారు.