HOME » VIDEOS » Crime

Video : శంషాబాద్‌లో మరో మహిళ మృతదేహం

క్రైమ్11:33 AM November 30, 2019

Hyderabad : శంషాబాద్‌లో మరో ఘోరం జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి తగలబెట్టినట్లు తెలుస్తోంది. సిద్దులగుట్ట ప్రాంతంలోని బంగారు మైసమ్మ ఆలయం పక్కనే ఈ ఘోరం జరిగింది. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఐతే అప్పటికే ఆమె చనిపోయింది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు, ప్లేట్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి దుస్తులు, చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి వయసు 35 ఏళ్లు ఉంటుందని.. సాయంత్రం 06.30 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ మృతదేహం ఎవరిది? ఆమెను ఎక్కడో చంపి ఇక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా? లేదంటే అక్కడ అత్యాచారం చేసి చంపారా? లేక అది సూసైడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18

Top Stories