విజయవాడ నగరంలో గంజాయ్ బానిసలు రెచ్చిపోతున్నాయి. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ తీసుకున్న ముగ్గురు యువకులు... గంగిరెద్దుల దిబ్బలో ఓ బాలుడిపై దాడి చేశారు. ఇప్పటికే చాలాసార్లు బస్తీలో ఉన్న మహిళలు, చిన్నారులపై గంజాయ్ బ్యాచ్ దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.