ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో విషం తాగి ప్రాణం తీసుకున్నాడు. నిన్న రాత్రి ఆయన సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, మారుతీరావు మరణంపై ఆయన కుమార్తె అమృత స్పందించింది. ‘ప్రణయ్ హత్య తర్వాత నుంచి నాన్న నాకు టచ్‌లో లేడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు టీవీలో చూశా. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడు.’ అని తెలిపింది.