పంజాబ్‌లో 2015వ సంవత్సరంలో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు సిక్కు మద్దతుదారులు చనిపోయారు. దానికి కారణం MSG అనే సినిమా విడుదల కూడా ఓ కారణం అని వార్తలోచ్చాయి. ఈ సినిమాలో డేరాబాబా గుర్మిత్ రామ్ రహీమ్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు, చిత్ర నిర్మాత కూడా. ప్రస్తుతం ఆయన రేప్ కేసులో చిక్కుకొని జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీనిలో బాలీవుడ్ అక్షయ్ కుమార్ మీద ఆరోపణ ఎంటంటే ఈ సినిమా విడుదల కోసం, అప్పటి పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్భీర్ సింగ్ భాదల్కి డేరా బాబా గురుమిత్ రామ్ రహీమ్‌కు మద్య మీటింగ్‌ను అక్షయ్ కుమార్, ముంబై, జుహులోని తన ఇంట్లో జరిపించాడని మాజీ MLA హర్బన్స్ జలాల్ ఆరోపించాడు. దీనికి తోడు జస్టీస్ రంజిత్ సింగ్ కమిషన్ కూడా MLA ఆరోపణను కోట్ చేసి తన నివేదికను సమర్పించింది. అయితే ఇందులో ఎంత వరకు నిజం వుందో తెలుసుకోవాడానికి ఈరోజు SIT అక్షయ్‌ను చండీగడ్‌లో ప్రశ్నించింది.