హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : సీఎం జగన్‌కి వ్యతిరేకంగా టిక్‌టాక్ వీడియో.. వ్యక్తి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్16:07 PM February 27, 2020

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అనుకూలంగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు, వీడియోలూ రావడం సహజం. వాటిలో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నా... పోలీసులు పోనీలే అని ఆయా వ్యక్తుల జోలికి వెళ్లకుండా జాలి చూపిస్తున్నారు. ఐతే... శృతి మించితే మాత్రం తాట తీస్తున్నారు. తాజాగా అదే జరిగింది. కడప జిల్లా... దువ్వూరికి చెందిన ఓ వ్యక్తి... సీఎం జగన్‌కి వ్యతిరేకంగా... అసభ్యకరంగా మాట్లాడుతూ... టిక్ టాక్ చేశాడు. అది సోషల్ మీడియా ద్వారా... షేర్ అయ్యింది. అనోటా ఈనోటా వినపడుతూ... చివరకు దువ్వూరు మండలం... పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నాయుకుడు జయచంద్రారెడ్డి దృష్టికి వెళ్లింది. ఏంటా వీడియో అని చూశారాయన. షాక్ అయ్యారు. ఆ మాటలేంటి? ఆ వీడియో ఏంటి? సీఎం పాలనపై అభ్యంతరాలుంటే... రాజ్యాంగ బద్ధంగా విమర్శలు చెయ్యాలి గానీ... ఇలా అసభ్యకరంగా మాట్లాడటమేంటి? అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ మొబైల్ నంబర్ ఎవరిదో కనుక్కున్నారు. ఇప్పుడు ఆ నంబర్ ఉన్న వ్యక్తి ఎక్కడున్నదీ లొకేషన్ ట్రేస్ చేశారు. వెంటనే... డేటా పోలీసులకు మెసేజ్ రూపంలో పంపించారు. పోలీసులు... మైదూకురు పట్టణానికి చెందిన పుల్లయ్య... ఈ పని చేసినట్లు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading