ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. దంతేవాడ జిల్లా బైలదిల్లా ప్రాంతంలో ఎన్ఎండిసి కిరండల్ మైనింగ్ ఏరియాలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నక్సల్స్ ఆరు డంపర్ ట్రక్కులను, మూడు ఎక్స్కెవేటర్లను దగ్ధం చేశారు. నెంబర్ 3 స్క్రీనింగ్ ప్లాంట్లో సౌకర్యాల మెరుగు కోసం ఈ యంత్రాలను తెచ్చారు. సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు పోలీస్ దళాలు అక్కడకు వెళ్లి పరిశీలించాయి.