హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం...రెండు బస్సులు ఢీకొని 60 మృతి...

అంతర్జాతీయం17:25 PM March 23, 2019

ఆఫ్రికా దేశం ఘనాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొని 60 మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు బస్సుల్లో కలిపి సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఓ బస్సులో మంటలు చెలరేగడంతో కొందరు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన 28 మంది సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ప్రమాదంపై ఘనా అధ్యక్షుడు నానా అకుఫో అడ్డో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Chinthakindhi.Ramu