చిత్తూరు జిల్లాలో చిన్నారి వర్షిత మృతిచెందిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి వర్షిత హత్యపై స్పందించిన జగన్.. హంతకుడ్ని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను జగన్ ఆదేశించారు.