కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు చనిపోయారు. నందిగామ సమీపంలోని అంబారుపేట వద్ద గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతులను నందిగామలోని విజయా టాకీస్ ప్రాంతానికి చెందిన అనిల్, సాయి మనోజ్, దుర్గ, అరవింద్‌గా గుర్తించారు. అతి వేగంతో పాటు డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ కారును నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నందిగామలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.