HOME » VIDEOS » Crime

Video : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది మృతి

క్రైమ్ న్యూస్09:18 AM February 23, 2020

Gujarat Road Accident : గుజరాత్... వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడోదర జిల్లాలోని పాద్రా తాలూకాలో మహువాద్ గ్రామంలో ఈ ప్రమాదం సంభవించింది. ఓ టెంపో, ట్రక్కు ఢీకొట్టుకున్న ఘటనలో... మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో స్పాట్‌లోనే ఏడుగురు చనిపోగా... మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో నలుగురు గాయపడిన వారికి చికిత్స అందుతోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. జిల్లా పోలీసు అధికారులు ఈ ఘటనను పరిశీలిస్తున్నారు. రేపు గుజరాత్... అహ్మదాబాద్‌కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు. ఇలాంటి సమయంలో... ఎలాంటి రోడ్డు ప్రమాదాలు, టెన్షన్లూ లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచీ ఆదేశాలు వచ్చాయి. ఆ క్రమంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నా్రు.

webtech_news18

Top Stories