కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రంగంలోకి దిగిన వైసీపీ ఎమ్మెల్యే రోజా... కొంతకాలంగా తన సొంత నియోజకవర్గమైన నగరిలోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వినూత్న ప్రయత్నానికి ఆమె శ్రీకారం చుట్టారు. నగరిలో ప్రజలు వైద్య పరీక్షలకు ముందుకు వచ్చేందుకు పోలీస్, రెవెన్యూశాఖ అధికారులకు పరీక్షలు చేయించారు. విధుల్లో ఉన్న సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కూడా రోజా పరీక్షలు చేయించారు. కరోనా పరీక్షలకు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదని రోజా అన్నారు.