కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 22న జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడలో ప్రజలు దుకాణాల బాట పట్టారు. నిత్యావసర సరుకుల కోసం వచ్చిన కస్టమర్లతో విజయవాడ డీమార్ట్ రద్దీగా మారిపోయింది. కరోనా భయం ఉన్నాప్రజలు ఒకరినొకరు తోసుకుంటూ సరుకులు కొనుక్కుని వెళ్లారు.