సత్తెనపల్లి: ప్రాణాంతక మైన కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పాత్రికేయుడు వళ్ళెం చెన్నకేసవ విన్నూతంగా యమధర్మరాజు వేషాధారణలో కనిపించారు. వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం ప్రధాన రహదారిపై వచ్చే వాహనాలను అపి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్ల మీదకి అనవసరంగా వస్తే ఎంజరుగుతుందో వివరించారు.
ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటూ బయటకు రావొద్దని, పోలీసులు,యమ ధర్మరాజు కలసి విజ్ఞప్తి చేస్తున్నారు.మాస్కులు లేకుండా బయటకు వచ్చిన యువకులను హెచ్చరించారు.