కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికన్లలో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పటి వరకు 16వేల మందికి వైరస్ సోకగా.. 219 మంది చనిపోయారు. ఈ క్రమంలో నిత్యావసరాలను స్టాక్ పెట్టుకునేందుకు ప్రజలు క్యూకడుతున్నారు. కొన్ని చోట్ల టాయిలెట్ పేపర్‌కు కొరత ఏర్పడింది. దాంతో టాయిలెట్ పేపర్ ఉత్పత్తిని వేగవంతం చేశాయి కంపెనీలు.