ఇటలీ నుంచి స్వదేశానికి వచ్చేందుకు భారతీయ విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. రోమ్ ఎయిర్ పోర్టు ఉంచి బయటపడేందుకు 24 గంటలుగా ఎదురుచూస్తున్నారు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, ఎయిరిండియాలు బోర్డింగ్ పాస్ లు ఇవ్వకపోవడంతో విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. దీనిపై విద్యార్థులు మాట్లాడుతూ ఎలాంటి లక్షణాలు లేకపోతే కరోనా టెస్టులు చేయబోమని చెప్తున్నారు. ఆ విషయం విమానాశ్రయ అధికారులకు చెప్పినా వినిపించుకోవడం లేదు. మీ ప్రభుత్వమే మిమ్మల్ని పట్టించుకోనప్పుడు మేం మాత్రం ఏం చేయగలం అని ఎయిర్ పోర్టు సిబ్బంది మాట్లాడారు. ఇది మాకు బాధాకరంగా ఉంది. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం సహా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు స్పందించి మాకు సాయం అందించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి అని వేడుకున్నారు.