కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు, శానిటైజేషన్ సిబ్బందికి తెలుగు సినీ ఇండస్ట్రీ సెల్యూట్ చేసింది. జనతా కర్ఫ్యూలో పాల్గొన్న సినీ ప్రముఖులు సాయంత్రం 5 గంటలకు తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ రియల్ హీరోస్‌ను అభినందించారు.