లాక్‌డౌన్‌తో వలస కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. రైళ్లు, బస్సులు నిలిచిపోవడంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోయారు. ముంబైలోనూ తెలంగాణకు చెందిన చాలా మంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుండి ముంబైకి ఉపాధి కోసం వెళ్ళగా.. లాక్‌డౌన్‌తో ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పనుల్లేక.. బతకడానికి డబ్బులు లేక.. నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ విషయం మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన వీడియో కాల్ చేసి కార్మికులతో మాట్లాడారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయి.. ఆర్థిక సాయం చేశారు మంత్రి. గూగుల్ పే ద్వారా తక్షణం రూ.90వేలు పంపించారు. కష్టకాలంలో తమను ఆదుకున్నారంటూ.. కార్మికులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.