కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి ముంబైకి ఉపాధి కోసం వెళ్ళి లాక్ డౌన్ ప్రకటించడం తో అక్కడే ఇరుక్కున్నారు. వారికి సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న సంగతి తెలుసుకొని వెంటనే స్పందించిన, సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు వారికి ఫోన్ చేసి వారి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, భోజనానికి సరిపడ సరుకులు, రూ.1,18,000 ఆర్థిక సాయాన్ని గూగుల్ పే ద్వారా అందించారు. సాయం చేసిన మంత్రికి, ముఖ్యమంత్రి వారు కృతజ్ఞతలు తెలిపారు.