తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో 85శాతం మర్కజ్ నుంచి వచ్చినవేనన్నారు తెలంగాణ మంత్రి ఈటల. రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగలేదని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ BRKR భవన్ నుండి తెలంగాణ వైద్యఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాష్ట్రం, దేశంలో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలపై టాక్స్ ఎత్తివేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అదేవిధంగా విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వైద్య పరికరాలను కస్టమ్స్, టాక్స్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.