కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్‌రాజన్ తెలిపారు. సాధారణంగా భారతీయుల ఆహారపు అలవాట్ల వల్లే కరోనా పెద్దగా వ్యాపించలేదని చెప్పారు. తులసి, మిరియాలు, పసుపు లాంటివి తీసుకోవడం వల్ల ఇలాంటి వైరస్‌లకు అడ్డుకట్ట పడుతుందన్నారు. దీంతోపాటు వాతావరణ పరిస్థితుల వల్ల కూడా కరోనా వ్యాప్తి చెండం లేదని చెప్పారు.