దేశంలోనే తొలిసారిగా కోవిడ్ 19 బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రి సిద్ధమైంది. బ్రహన్ ముంబై కార్పొరేషన్ సహకారంతో సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పటల్ దీన్ని నెలకొల్పింది. 100 బెడ్లు ఉన్న ఈ ఆస్పత్రిలో కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకకుండా గట్టి చర్యలు చేపట్టారు.