నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు తన ఉనికిని చాటుకుంటుంది.. ఇప్పటికే జిల్లాలో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో కరోనా కట్టడికి అధికారులు టోటల్ లాక్ డౌన్ విధించారు. జిల్లాలో 15 కంటైన్‌మెంట్ క్లస్టర్‌ల పరిధిలో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలవుతోంది. ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్లస్టర్ల పరిధిలో అధికారులు ఇంటింటి సర్వే చేస్తూ ప్రతి ఒక్కరి రక్తనమూనాలు సేకరిస్తున్నారు. కొవిడ్ 19 పాజిటివ్ కేసుల నమోదు పెరగడంతో అధికార యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, మార్కెటింగ్ శాఖల సంయుక్త కార్యచరణతో లాక్ డౌన్ అమలు అవుతున్నది.