శుక్రవారం వేములవాడ పట్టణంలోని రెడ్ జోన్ ఏరియాలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటించారు. వేములవాడ లో రెడ్‌జోన్‌గా ప్రకటించిన సుభాష్ నగర్ ఏరియా లో ఉండే వారు తమ ఇళ్ల నుంచి బయటకు రావడం నిషిద్ధమని కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు.
బ్యారీ కెడ్లు ఏర్పాటు, పారిశుద్ధ్య కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.