కరోనావైరస్ భయాన్ని వ్యాపారవేత్తలు క్యాష్ చేసుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్‌లు, శానిటైజర్స్‌ని ఎక్కువ ధరకు అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మితే పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.