కరోనా వ్యాప్తిని భారతదేశంలో సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్ డౌన్ పొడగింపుకు మించిన మార్గం లేదని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్పష్టంచేసింది. లాక్ డౌన్ ను కొనసాగించాలని కోరింది. భారత ప్రధాని నరేంద్ర మోడి బుధవారం పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ నుండి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె. కేశవరావు, లోక్ సభ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ వైఖరిని డాక్టర్ కేశవరావు ప్రధానమంత్రికి స్పష్టంగా తెలియచేశారు.