నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 47కు చేరినాయి. నగరంలోని పదకొండు కంటోన్మెంట్ ఏరియాలో డిఐజి, సిపి పర్యటించారు. హాట్ స్పాట్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్ అందజేసారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలందరూ సంయమానం పాటించాలని, ఎవ్వరూ బయటకు రాకూడదని సిపి కార్తికేయ తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని శానిటైజర్స్ వాడాలని కోరారు.