నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో టీఎన్జీవోస్, ముత్తూట్ ఫైనాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు వందల యాభై మంది నిరుపేదలకు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, పప్పు, కారంపొడి, పసుపు, టీ పొడి, ఆయిల్ తదితర వస్తువులు ఇచ్చారు.. అనంతరం జిల్లా మీడియా ప్రతినిధులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.