నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు తాజాగా 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కలెక్టర్ సీ.నారాయాణరెడ్డి వెల్లడించారు.. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి లాక్ డౌన్ అంక్షాలను ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పారు.. ఈ రోజు బోధన్ మున్సిపాలిటీ లోని నగర్ శక్కర్ నగర్, రాకాసి పేట ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 14 రోజులు చాలా కఠినమైన లాక్ డౌన్ పాటిస్తే మనం ఆరెంజ్ జోన్ కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం మన జిల్లా రెడ్ జోన్ లో ఉన్నదని, రాబోయే 14 రోజులు ఎవరు కూడా ఇల్లు విడిచి బయటకు రావద్దన్నారు..