కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటలకు కరెంట్ ఆపేసి 9 నిమిషాలపాటు కొవ్వుత్తులు వెలిగించి ఐక్యత చాటారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కొవ్వొత్తులు వెలిగించారు.