హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : కరోనా ఎఫెక్ట్.. మాస్కులతో మ్యారేజ్..

ఆంధ్రప్రదేశ్13:00 PM March 18, 2020

కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో... శుభకార్యాలను కూడా అత్యంత జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. పెళ్లిని కూడా మాస్కులు ధరించి చేసుకోవాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్రమైన పెళ్లి జరిగింది... వరుడు, వధువు, పంతులుగారు, అతిథులు అందరూ మాస్కులు ధరించారు. పశ్చిమగోదావరి జిల్లా... ఉంగుటూరు మండలంలో ఈ పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ మాస్కు ఇచ్చారు. తప్పనిసరిగా ధరించాలని కండీషన్ పెట్టారు. నిజానికి కరోనా వైరస్ సోకుతోంది కాబట్టి పెళ్లిళ్లు, శుభకార్యాలను వాయిదా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలూ కోరుతున్నాయి.ఐతే... ఈ పెళ్లికి సంబంధించి రెండు నెలల ముందే... ముహూర్తం ఫిక్స్ చేశారు. అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అదీకాక మరో బలమైన కారణం కూడా ఉంది. ఈ పెళ్లిలో అందరూ మాస్కులు ధరించడం ద్వారా... కరోనా వైరస్‌పై అందరికీ అవగాహన కల్పించినట్లు అవుతుందని ఇలా నిర్ణయించారు. మంచి ఉద్దేశంతో జరుగుతున్న పెళ్లి కావడంతో... ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించారు. వీడియోలు, ఫొటోల్లో మాస్కులతో ఉండటం ప్రత్యేకంగా కనిపిస్తోంది. డాక్టర్లు కూడా ఈ పెళ్లిని మెచ్చుకుంటున్నారు. ప్రజలంతా ఇలా అవేర్‌నెస్ పెంచుకోవాలని సూచిస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading