చైనాలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనావైరస్ యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వైరస్ పేరు చెబితేనే జనాలు వణికిపోతున్నారు. ఏ మాత్రం దగ్గు, జలుబు, జ్వరంగా ఉన్నా.. కరోనా వైరసేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానంతోనే చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. తొట్టంబేడు మండలం శేషమనాయుడుకండ్రిగలో ఈ ఘటన చోటుచేసుకుంది.