కరోనా వైరస్ బాగా వ్యాపిస్తుండటంతో... కేంద్ర ప్రభుత్వం చుట్టూ ఉన్న దేశాలతో సరిహద్దుల్ని మూసేస్తోంది. 32 ఎంట్రీ పాయింట్లలో 19 మాత్రమే అనుమతిస్తోంది. ఆ క్రమంలో అగర్తలాలోని... బంగ్లాదేశ్ సరిహద్దుతో ఉన్న రోడ్డును మూసేసింది. భారత్లోకి భారతీయుల్ని మాత్రమే అనుమతిస్తూ... వారికి కరోనా వైరస్ టెస్టులు చేసి మాత్రమే లోపలికి రానిస్తోంది.