మలేసియా రాజధాని కౌలాలంపూర్లో భారతీయులు చిక్కుకున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే విమానాలు, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే విమానాలపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో మలేసియాలో ఉన్న భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. స్వదేశానికి వెళ్లే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన వసతి, తిండిలేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడి నుంచి తరలించాలని బాధితులు కోరుతున్నారు.