కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కు ధరిస్తున్నామని, హ్యాండ్ శానిటైజర్ వాడుతున్నామన్నారు విదేశీ పర్యాటకులు. చార్మినార్ సందర్శనకు వచ్చిన విదేశీయులను న్యూస్18 సంప్రదించగా.. వీలైనంత వరకు తాము జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరగడం లేదని చెప్పారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే మాస్కు ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు.