ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ అంతగా లేదన్న సీపీఐ నేత నారాయణ... ఏపీలో హింస, దౌర్జన్యాలు ఎక్కువగా ఉండటం వల్లే... కేంద్ర హోంశాఖ దీనిపై చర్యలు తీసుకుంటూ... ఎన్నికల్ని వాయిదా వేయించిందన్నారు. నిజాయితీగా ఉండే అధికారులు సీఎం జగన్ పాలనలో ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. తన పాలనపై డౌట్ ఉండబట్టే... జగన్ ఇలా దౌర్జన్యాలకు పాల్పడేలా చేయిస్తున్నారని ఆరోపించారు నారాయణ.